GDWL: కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామంలోని ప్రభుత్వ గ్రామీణ పశు వైద్యశాల తలుపులను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని సోమవారం ఉదయం వైద్యశాలను ప్రారంభించడానికి వెళ్లిన వైద్యులు తెలిపారు. లోపల ఏం వస్తువులు పోయాయో అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తున్నారు.