సత్యసాయి: గుడిబండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధిలోని మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగల్ విండో అధ్యక్షులు వద్దనుకుంటప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటారు.