KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాతలింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 9:30 గంటలకు ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి బి. తారాదేవి తెలిపారు. ఈ సందర్భంగా యూరియా మొబైల్ యాప్ ద్వారా బస్తాల బుకింగ్, ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.