VKB: జిల్లాలో స్నేహితుల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అగ్గనూరు గ్రామానికి చెందిన సమీర్ ఖాన్, అరుణ్ గౌడ్ స్నేహితులు. నాగులకుంట వద్ద ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. ఈ క్రమంలో అరుణ్ గౌడ్ సమీర్‌ను కొట్టి బైక్‌ను తీసుకెళ్లాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన సమీర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.