సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 2వ వార్డు చౌడేశ్వరి కాలనీలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ టీఎన్ దీపిక ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల మద్దతు కోరుతూ సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్ రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.