కోనసీమ: సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా మున్సిపల్, సచివాలయం సిబ్బంది కృషి చేయాలని మండపేట కమిషనర్ టీవీ రంగారావు తెలిపారు. పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి క్షేత్ర స్థాయిలో వార్డులలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.