విశాఖలోని 20వ వార్డు చినవాల్తేరులో గురువారం పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాష్, సహాస్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. వ్యర్థాల నిర్వహణ, పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణపై నిపుణులు అవగాహన కల్పించారు.