సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రశాంతి నిలయంలో భక్తులతో కలిసి 100 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రత, భక్తుల ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం చిత్రావతి నది ఒడ్డున బాబా జీవితంపై ప్రదర్శించిన లేజర్ షోను వీక్షించారు.