NGKL: కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్య దర్శి మబ్బు సాయన్న మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ అమరేందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. షాపులను స్థానికులకే కేటాయించాలని, వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలని కోరారు.