అన్నమయ్య: మదనపల్లెలోని YSR కాలనీలో పేకాట ఆడుతున్న 10 మంది జూదరులను అరెస్టు చేసినట్లు మదనపల్లె 2వ పట్టణ సీఐ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు.పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీస్ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి రూ. 24,500వేల నగదు,10 మొబైల్ ఫోన్లు, 2 బైకులు,1 ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.