SRPT: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.