‘3’ మూవీలో సరదాగా పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు మంచి క్రేజ్ వచ్చిందని ధనుష్ చెప్పాడు. ‘సరదాగా ఒకరోజు చిన్న ట్యూన్ చేసి పాట పాడాను. అది ఫన్నీగా ఉండటంతో సినిమాలో భాగం చేశాం. ఆ పాటకు చాలా క్రేజ్ వచ్చింది. అది వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఇంకా నన్ను వదలడం లేదు. 10ఏళ్లు గడిచినా ఆ పాటను మాత్రం ప్రేక్షకులు మర్చిపోవడం లేదు’ అని తెలిపాడు.