WNP: వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేటు కంపెనీలకు మళ్లిస్తున్నారని, బోర్డును ప్రభుత్వం స్వయంగా నిర్వహించాలంటూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొబ్బిలి నిక్సన్, వెంకటయ్య గురువారం డిమాండ్ చేశారు. పెద్దమందడిలో జరిగిన సంఘ సమావేశంలో అధ్యక్షుడు కురుమూర్తి, కోశాధికారి శ్రీను, ఆశన్న, నాగభూషణ్ పాల్గొని కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.