AP: రాష్ట్రంలో యువతకు ఆధునిక నైపుణ్యాలను అందించి, వారికి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీ దగ్గుమళ్ల అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న NSTI కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని, మూడేళ్ల కాలపరిమితితో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుందని వివరించారు. కొత్త సంస్థ ద్వారా ఏఐ వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.