2016లో విజయ్ ఆంటోనీ హీరోగా.. దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. దాంతో బిచ్చగాడు2కి భారీ వసూళ్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
Bicchagadu 2: బిచ్చగాడు (Bicchagadu) సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. అందుకే బిచ్చగాడు 2 పై (Bicchagadu 2) భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 19న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ (vijay antony) హీరోగా నటించడమే కాకుండా.. దర్శకత్వం వహించి, మ్యూజిక్ కూడా అందించాడు. విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన కూడా.. ఈ సీక్వెల్ అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది.
వరల్డ్ వైడ్‌గా 13 కోట్లకు పైగా షేర్, 26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంటున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్లకు పైగా షేర్.. 12 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అప్పుడే ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జూన్ మూడో వారం నుంచి తెలుగు, తమిళ్లో డిజిటల్ స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిచ్చగాడు2 (Bicchagadu 2) జూన్ 12న ఓటిటిలోకి రానుందని తెలుస్తోంది. దీంతో నెల తిరక్కుండానే ఈ సినిమా ఓటిటిలోకి రానుందని చెప్పొచ్చు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.