కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఈ నెల 22వ తేదీ శనివారం హైదరాబాద్లో జరిగే సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ పోస్టర్ను ఎస్సై ఆవుల తిరుపతి గురువారం ఆవిష్కరించారు. మండలంలోని యువ రచయితలు, కవులు, కళాకారులు ఈ సాహిత్యోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.