KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గురువారం అట్టహాసంగా గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమాలకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి పథకం కింద వీరాపూర్ను పైలట్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు.