KNR: రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో క్వింటాల్‌కు 8 కిలోల తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారన్నారు.