KMM: పత్తి, మిర్చి ఎలక్ట్రిక్ కాటాలు రిమోట్ కంట్రోల్‌తో తూకం తక్కువ చూపించి రైతులను వరుసగా మోసం చేస్తున్న దళారుల పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రైతు సంఘం ఆఫీస్‌లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సమావేశం వారు పాల్గొని మాట్లాడారు.