ప్రకాశం: VRAల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. హనుమంతునిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట VRAలు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హత కలిగిన VRAలను VROలుగా పదోన్నతి కల్పించాలన్నారు.