PPM: పట్టణంలోని పార్కులను మరింత అందంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్ది మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నర్సిపురం చెరువు, చర్చి వీధితో పాటు పలు ప్రాంతాల్లోని పార్కులను కలెక్టర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరవాసులకు అందంగా ఆహ్లాదకరంగా పార్కులు ఉండాలన్నారు. ఆయన వెంట జే.సీ. సబ్ కలెక్టర్, పురపాలక కమిషనర్ ఉన్నారు.