PPM: పార్వతీపురం మండలం పెద్దమరికి గ్రామంలో నూతన అంగన్వాడి బిల్డింగ్ నిర్మాణానికి ఇవాళ పార్వతీపురం శాసనసభ్యులు బోనీల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ విస్మరించకుండా నడుపుతున్నామన్నారు.