W.G: పాలకొల్లులో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్‌ను దొంగిలిస్తుండటం కలకలం సృష్టిస్తోంది. జులాయిలు చెడు అలవాట్ల కోసం పెట్రోల్ పైపులను ధ్వంసం చేసి, ఇంధనాన్ని దొంగిలించి తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలను వీధుల్లో ఉంచాలంటే యజమానులు భయపడుతున్నారు. పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.