HNK: కనకదుర్గకాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గురువారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరమని చెప్పారు.