KRNL: ఎమ్మిగనూరు మండలంలో ఉన్న బనవాసి గురుకుల పాఠశాలలో ఉత్తమ సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సామ్రాజ్యం, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ మహబూబ్ బాషా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు.