WNP: జిల్లా కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.