NDL: డోన్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో రేపు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరవుతున్నట్లు డోన్ మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గురువారం తెలిపారు. కావున మండల పరిధిలోని ఆయా గ్రామాల, పట్టణ ప్రజలు తమ సమస్యలను ఆర్జీలను రూపంలో ఇచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.