RR: జనంబాటలో భాగంగా అత్తాపూర్ డివిజన్ భూపాల్ నగర్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేరుకున్నారు. బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 45 ఏళ్లుగా 2వేల కుటుంబాలు ఇంల్లు కట్టుకొని ఉంటున్నారని, అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాక పట్టాలిస్తామని చెప్పి ఆపని మాత్రం చేయలేదని ఆరోపించారు. ప్రజలందరికీ పట్టాలు వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు.