KDP: సిద్ధవటంలోని ZPHS పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ RBSK నోడల్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి శుభ్రత పాటిస్తే సీజన్ వ్యాధులు దరిచేరమన్నారు. భోజనం ముందు, మలవిసర్జన తర్వాత చేతులు పరిశుభ్రంగా పెట్టుకోవాలన్నారు.