ADB: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య, విద్యా, పోలీసు, అంగన్వాడీ రంగాల్లో మహిళలు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.