NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ముంబయి జాతీయ రహదారి సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్మన్ సుప్రజ హెచ్చరించారు. ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ ఆఫీసులో అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.