CTR: పుంగనూరు పట్టణంలోని నగిరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా పార్థివ లింగ పూజ వైభవంగా జరిగింది. ముందుగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం మహిళలు పార్థివ లింగాలకు పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనెతో అభిషేకాలు చేసి, తర్వాత దీపారాధన చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.