తమిళ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ‘కరుప్పు’ మూవీతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకు మరో ఇద్దరు తెలుగు దర్శకులు పరశురామ్, వివేక్ ఆత్రేయ కథలు వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా వీటిపై ఆసక్తి చూపించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.