యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నిర్మాణ సంస్థ ఈటీవీ విన్ దీని టికెట్ ధరలను తగ్గించింది. టికెట్ ధరలు సింగిల్ థియేటర్లలో రూ.99, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150గా నిర్ణయించింది. పైరసీపై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.