TPT: సత్యవేడు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే సత్యవేడు మండలం జడేరికి చేరుకొని నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారుల వెంటబడి అభివృద్ధి పనులు చేయిస్తానని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు.