TG: టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘గద్దర్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో నాగ చైతన్యకు అద్భుత గౌరవం దక్కింది. తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘తండేల్’ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.