AKP: మాక్ అసెంబ్లీకి ఎన్నికైన మునగపాక మండలం గణపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నందరాపు జశ్వంత్ని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జస్వంత్ని మిగిలిన విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.