TG: మాజీమంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. ‘మీరు చెప్పిన అబద్దాలు, చేసిన అవినీతికే మీరు ఇంట్లో కూర్చొన్నారు. సిగ్గు లేకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియనిది కాదు. మీకు దమ్ముంటే మీ కుటుంబసభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అంటూ సవాల్ విసిరారు.