నెల్లూరు కామాటి వీధి కృష్ణుడి మందిరంలో కృష్ణుడి పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని దొంగలించిన వ్యక్తిని త్రీ టౌన్ పోలీసులు నిన్న ఐదు గంటల్లో పట్టుకున్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని తీసుకుని వెళ్లాడు. అనంతరం హరినాధపురంలో ఒక వ్యక్తికి ఆ విగ్రహాన్ని విక్రయించాడు. వారిని గుర్తించి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.