VZM: బొబ్బిలి మండలం మెట్టవలసలో రైతులు సాగు చేస్తున్న సేంద్రియ వరిసాగును మాజీమంత్రి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డవలప్ మెంట్ ఛైర్మన్ సుజయకృష్ణ రంగారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సేంద్రియ వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సేంద్రియ సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చునని చెప్పారు.