ప్రకాశం: ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రజలకు అవసరమైన సేవలను గ్రామస్థాయిలోనే అందించేందుకు ఈనెల 22 నుంచి గ్రామ సభలను నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొత్త జాబ్ కార్డు కోసం, పని కోసం దరఖాస్తులను స్వీకరిమన్నారు.