GNTR: జిల్లాలో పురుష ప్రయాణికుడికి ‘స్త్రీ శక్తి’ టికెట్‌ను జారీ చేసిన కారణంగా ఓ ఆర్టీసీ కండక్టర్‌ను ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. ఈ నెల 4న గుంటూరు నుంచి తుళ్లూరు వెళ్ళే బస్సులో ప్రయాణికుడు టికెట్ తనిఖీలో అధికారులకు దొరకడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. నిబంధనలను అతిక్రమించిన కండక్టర్‌పై విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.