కాకినాడ: శృంగవృక్షంకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ కుమ్మరి నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు