WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు చెరువు గండిపడినప్పుడు పంటలు నాశనం కాకుండా రైతులు వెంటనే ఇసుక బస్తాలు, మట్టి, పక్కనే ఉన్న మూడు ఈత చెట్లతో గండిని పూడ్చారు. ఈ పనిని రాజకీయ రంగు పులుముకుని బీఆర్ఎస్కు ఆపాదిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం రైతాంగాన్ని మనస్తాపానికి గురిచేస్తోందని బుధవారం రైతులు తెలిపారు.