NZB: జాతీయ బార్ కౌన్సిల్ మెంబర్, అసిస్టెంట్ సోలిసిటర్ విష్ణు వర్ధన్ రెడ్డి బుధవారం ఆర్మూర్ బార్ అసోసియేషనను సందర్శించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్య దర్శి జెస్సు అనిల్ కుమార్, సీనియర్ న్యాయవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యుల సమస్యలను విని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.