JGL: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం అమలుకు జగిత్యాల అధికారులు సిద్ధమయ్యారు. కోటి మహిళలకు చీరల పంపిణీ లక్ష్యంగా, ఈనెల19 నుంచి డిసెంబర్ 9 మధ్య 65 లక్షల ఐకేపీ మహిళలకు, మార్చిలో మిగిలిన మెప్మా మహిళలకు చీరలు ఇవ్వాలని సీఎం వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.