ప్రకాశం: వెలిగండ్లలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 42,300 మంది అన్నదాతలకు రూ. 28.42 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.