VKB: కుక్కల నియంత్రణకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేసి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జనన నియంత్రణ కేంద్రంలో నిర్వహిస్తున్న కుక్కల ఆపరేషన్లను డాక్టర్ సదానందం పరిశీలించారు.