AP: కడప జిల్లా పెండ్లిమర్రి పర్యటనలో భాగంగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు రూ.3200 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మరోవైపు, పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే.