W.G: తణుకు మండలం వేల్పూరు విష్ణు ప్రియ నగర్లో సోమవారం భారీ చోరీ వెలుగుచూసింది. వరద వెంకటరమణ కుటుంబంతో కాశీ యాత్రకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి కిలో వెండి వస్తువులు, రూ. 20 వేల నగదు అపహరించారు. తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.